వనపర్తి: వనపర్తిలో 14 రోజుల పాటు కుష్ఠు వ్యాధి సర్వే: ప్రజలు సహకరించాలని డీఎంహెచ్ఓ పిలుపు
వనపర్తి జిల్లాలో అక్టోబర్ 22 నుండి నవంబర్ 4 వరకు కుష్ఠు వ్యాధి నిర్మూలన సర్వే జరుగుతోంది. 542 బృందాల ద్వారా ఇంటింటా తనిఖీలు నిర్వహిస్తున్నారు. చర్మంపై స్పర్శ లేని మచ్చలు ఉంటే వెంటనే ఆరోగ్య సిబ్బందికి తెలియజేయాలని డీఎంహెచ్ఓ భాస్కర్ నాయక్ సూచించారు.