కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పరిధిలోని కాశినాయన మండలంలో వరికుంట్ల గ్రామంలో బుధవారం విషాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. వరికుంట్ల గ్రామంలో పంటపొలాల్లో జంతువులకు వేసిన విద్యుత్ వైర్లు తగిలి వ్యక్తి మృతి చెందారు. మృతుడు వరికుంట్ల గ్రామానికి చెందిన జయన్నగా గుర్తించారు.పోలీసులు సంఘటన స్థలానికి చెరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఈ ఘటన పై మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది..