పలమనేరు: ముసలిమడుగు గ్రామస్తులు మరియు జిల్లా రైతు సంఘం నాయకుడు ఉమాపతి నాయుడు మీడియా తెలిపిన సమాచారం మేరకు. తమ గ్రామాల్లోని చెరువు క్రింద భూముల్లోకి రెండు జంట ఏనుగులు వచ్చాయి వరి పంటలను తిని కాళ్లతో తొక్కి ధ్వంసం చేశాయి. సుమారు రెండు ఎకరాల వరి పంట నష్టం చేకూర్చాయి. ఈరోజు రాత్రి కూడా జంట ఏనుగులు ఏమైనా గ్రామాల్లోకి లేదా మా పంట పొలాల్లోకి వచ్చి దాడులు చేస్తాయేమోని బిక్కుబిక్కుమంటూ భయాందోళన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి ఏనుగులను తిరిగి అడవిలోకి పంపించేందుకు కృషి చేయాల్సిందిగా వేడుకున్నారు.