బనగానపల్లె: సంజామల మండలంలో 164 పోలింగ్ కేంద్రాలు
సంజామల మండల వ్యాప్తంగా 164 పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు ఆదివారం పరిపాలన అధికారి రామసుబ్బయ్య, స్వర్ణ గ్రామాల డిప్యూటీ ఎంపీడీవో సురేశ్ బాబు తెలిపారు. ఎంపీడీవో, ఎమ్మార్వో కార్యాలయాలతో పాటు సొసైటీలో పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను ప్రదర్శించినట్లు పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాలపై ఏమైనా అభ్యంతరాలుంటే అర్జీలు సమర్పించాలని సూచించారు. ఈనెల 31న తుది జాబితా విడుదల చేస్తామని తెలిపారు.