అద్దంకి టిడిపి ఎమ్మెల్యే రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గురువారం అసెంబ్లీ సమావేశాలలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం పై మాట్లాడారు. రాష్ట్రంలో 5006.35 మెగావాట్లు విద్యుత్ సామర్థ్యం ఉన్నట్లు చెప్పారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 ను తీసుకు వచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ పాలసీ ద్వారా రాష్ట్రంలో సోలార్ విద్యుత్ సామర్థ్యాన్ని 78.50 మెగావాట్లు పెంచే దిశగా అడుగులు వేస్తున్నట్లు మంత్రి రవికుమార్ తెలియజేశారు.