సర్వేపల్లి: గిరిజన స్త్రీని మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోండి : పోలీసులకు సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదేశం
తోటపల్లి గూడూరు లోని గిరిజన కాలనీలో ఉన్నావో మహిళను ఇంటి నిర్మాణ విషయంలో మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పోలీసులు ఆదేశించారు. శనివారం పెన్షన్ల పంపిణీ కోసం ఆయన గిరిజన కాలనీకి వెళ్లారు. ఈ సందర్భంగా కూనమ్మ ఎమ్మెల్యేని కలిశారు. వైసిపి హయాంలో తాను ఇంటికి బేస్మెంట్ వేశానని. అందుకు ప్రభుత్వం తనకు విడుదల చేసిన లక్ష రూపాయలను ఓ వ్యక్తి కాజేశాడని అతనిపై చర్యలు తీసుకోవాలని కోరింది.. దీనిపై ఎమ్మెల్యే పోలీసులతో మాట్లాడారు