జగ్గంపేట: వీధి కుక్కల దాడులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు: బాధ్యులెవరో తెలుసా?
వీధి కుక్కల దాడిలో ఎవరైనా గాయపడినా లేదా మరణించినా స్థానిక అధికారులు, కుక్కలకు ఆహారం ఇచ్చేవారే బాధ్యులని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బాధితులకు భారీ పరిహారం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. కుక్కల మీద ప్రేమ ఉన్నవారు వాటిని ఇళ్లకు తీసుకెళ్లాలని సూచించింది.