వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కేంద్రం లో త్యాగాలకు ప్రతీకగా నిలిచిన మొహర్రం వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు. చావిడిలలో అలంకరణ చేసిన పీర్లను తెల్లవారుజామున బయటకు తీశారు. పీర్లను పట్టుకుని గ్రామ పురవీధుల్లో మేళతాళాలతో ఊరేగించారు. పీర్లను భక్తులు దర్శించుకొని మొక్కలు తీర్చుకున్నారు.