పార్వతీపురం: జి.ఎల్.పురం ఏకలవ్య పాఠశాలలో వైభవంగా ప్రారంభమైన క్లస్టర్-1 స్పోర్ట్స్ మీట్
జి.ఎల్.పురంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో క్లస్టర్-1 స్పోర్ట్స్ మీట్ ప్రారంభమైంది. జేసీ ఆర్.వైశాలి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ క్రీడా పోటీల్లో 10 పాఠశాలల నుంచి 400 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, క్రీడా నైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నారు.