అమలాపురం: అమలాపురంలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ హరీష్ బాలయోగి
అమలాపురంలో జరిగిన 'స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర' కార్యక్రమంలో ఎంపీ గంటి హరీష్ బాలయోగి పాల్గొన్నారు. స్థానిక పరిసరాలను శుభ్రం చేసి, మొక్కలు నాటిన ఎంపీ, స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర సాధనలో ప్రతి ఒక్కరూ బాధ్యతతో మెలగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.