శ్రీశైలం: శ్రీశైలంలో ముగిసిన దసరా మహోత్సవాలు. జమ్మివృక్షానికి శమిపూజ,ఆలయ పుష్కరిణిలో తెప్పోత్సవం
శ్రీశైలంలో దసరా మహోత్సవాలు పది రోజుల పాటు కన్నులపండువగా వైభవోపెతంగా జరిగాయి పదోవరోజు అమ్మవారు నిజాలంకరణ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు భ్రమరాంబాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారికి మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు వేదపండితులు వేదమంత్రోచ్చరణలతో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు అమ్మవారి ఆలయ పక్కన ప్రత్యేక వేదికపై పూజలు నిర్వహించి అలానే నందివాహనంపై ఉన్న శ్రీస్వామి అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించి శ్రీస్వామి అమ్మవారిని ఊరేగింపుగా శమి వృక్షం వద్దకు తీసుకొచ్చి జమ్మి వృక్షానికి అర్చకులు, ఆలయ చైర్మన్ పోతుకుంట రమేష్ నాయుడు,ఈఓ శ్రీనివాసరావు దంపతులు, బోర్డ్ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు.