పాడేరు: అల్లూరి ఏజెన్సీలో రేషన్ కోసం ప్రమాదకర వాగు దాటుతున్న గిరిజనులు #localissue
అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండలం లక్ష్మీపురం పంచాయతీ డుంబ్రిపుట్టు గ్రామంలో గిరిజనులు రేషన్ సరుకుల కోసం ప్రమాదకర వాగు దాటుతూ తమ రేషన్ మోసుకొస్తున్నారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా గ్రామాల్లో ఇళ్లకు పరిమితమైన వారంతా తిండి లేక తప్పని పరిస్థితిలో వాగుని దాటుకుని వెళ్లి లక్ష్మీపురం వద్ద రేషన్ తీసుకుని తమ గ్రామానికి అతి కష్టం మీద చేరుకుంటున్నారు. డంబ్రీపుట్టు వద్ద వాగుపై బ్రిడ్జి నిర్మించాలని వారంతా కోరుతున్నారు. ఈ సమస్యపై స్థానిక ప్రజాసంఘాల నేత కొర్ర అర్జున్ శనివారం ఉదయం పబ్లిక్ యాప్ టు వీడియో రూపంలో సమస్యను వెల్లడించారు.