కుప్పం: కుప్పంలో డ్రైనేజీల నిర్మాణానికి రూ.19.5 కోట్లు
కుప్పం మున్సిపాలిటీ పరిధిలో డ్రైనేజీ కాలువల నిర్మాణానికి సీఎం చంద్రబాబు రూ.19.5 కోట్లు మంజూరు చేశారని ఎమ్మెల్సీ కంచర శ్రీకాంత్ ప్రకటించారు. కుప్పం పట్టణంలో వాకింగ్ స్ట్రీట్, చిరు వ్యాపారులకు దుకాణాలు ఏర్పాటు చేసుకునేలా డ్రైనేజీలు నిర్మిస్తామన్నారు. అమరావతి రాజధాని డిజైన్ చేసిన సుర్భాన కంపెనీ ద్వారా కుప్పం అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు.