వరంగల్: స్మార్ట్ రేషన్ కార్డుల కోసం డబ్బులు వసూలు.. ఆశా వర్కర్ సస్పెండ్
వరంగల్ 26వ డివిజన్ గిర్మాజిపేటలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో అక్రమ వసూళ్లకు పాల్పడిన ఆశా వర్కర్ ఏ. రమాదేవిని అధికారులు సస్పెండ్ చేశారు. కార్డుకు 30 నుండి 50 రూపాయలు వసూలు చేస్తున్న వీడియో వైరల్ కావడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నారు.