జలదంకి మండలం,చింతల పాలెం లో టిడిపి నేత గొట్టిపాటి ప్రసాద్ నాయుడు హత్యకు గురైన విషయం తెలిసిందే కావలి ఏరియా వైద్యశాలలో పోస్టుమార్టం అనంతరం స్వగ్రామం చింతలపాలెంలో అంతక్రియలు శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొని వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆకస్మికంగా జరిగిన ఈ విషాద ఘటనపై కుటుంబ సభ్యులతో మాట్లాడితే వారికి ధైర్యం తెలిపామన్నారు. ప్రసాద్ నాయుడు మరణానికి కారణమైన నిందితులపై కఠిన చర్యలు తీసుకునేందుకు అధికారులతో ప్రత్యేకంగా చర్చించి కుటుంబానికి పూర్తి న్యాయం జరిగే వరకూ నిరంతరం సహకారం అందిస్తామని స్పష్టం చేశారు.