జనగాం: జనగామలో రెండో రోజుకు చేరిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ధర్నా
జనగామ కలెక్టరేట్ ముందు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల నిరసన రెండో రోజుకు చేరుకుంది. ఇండ్ల నెంబర్ల కేటాయింపు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నల్ల జెండాలతో ర్యాలీ నిర్వహించారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు.