పెద్దకొత్తపల్లి: కల్వకోల్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాల ఇంగ్లీష్ పుస్తకాలు
పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఇంగ్లీష్ పుస్తకాలను KEDS కమిటీ పంపిణీ చేసింది. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా విద్య అందించేందుకు కృషి చేస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. త్వరలో విద్యార్థులకు కంప్యూటర్లు కూడా అందించనున్నారు.