రామాయంపేట్: రామాయంపేటలో ఘోర ప్రమాదం: రైలు ఢీకొని 40 గొర్రెలు మృతి
మెదక్ జిల్లా రామాయంపేట మండలం తోనిగండ్ల శివారులో రైలు ఢీకొనడంతో కూకట్ల రెడ్డయ్యకు చెందిన 40 గొర్రెలు మృతి చెందాయి. మెదక్-అక్కన్నపేట రైల్వే లైన్ వద్ద ఈ ఘటన జరిగింది. నష్టపోయిన తమను ఆదుకోవాలని బాధితుడు ప్రభుత్వాన్ని కోరారు.