ఖాళీ స్థలాలకు పన్నులు విధించాలి : కమిషనర్ నందన్ ఆదేశం
నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ రెవిన్యూ అధికారులతో వారాంతపు సమీక్ష సమావేశాన్ని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అడ్మిన్ కార్యదర్శులను, రెవెన్యూ సిబ్బందిని ఉద్దేశించి కమిషనర్ మాట్లాడుతూ సర్వీస్ రిక్వెస్ట్లు, ఆటో మ్యుట్ టీషన్లు ప్రభుత్వం నిర్దేశించిన గడువు లోపల పూర్తి చేయాలని, ఖాళీ స్థలములకు పన్నులు విధించాలని ఆదేశించారు. ఫీల్డ్ లెవల్ ఇన్స్పెక్షన్ జరిగినప్పుడు టాక్స్ పరిధిలో లేని భవనాలను గుర్తిస్తే సంబంధిత అధికారులపై తగిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కమిషనర్ స్పష్టం చేశారు