కనిగిరి: హాజీపురం, మిట్టపాలెం గ్రామాల్లో ప్రభుత్వ భూములను కాపాడాలి: వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు
హనుమంతునిపాడు మండలంలోని హాజీపురం, మిట్టపాలెం గ్రామాల్లో ప్రభుత్వ భూములను కాపాడాలని కోరుతూ స్థానికులతో కలిసి వ్యవసాయ కార్మిక సంఘం ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షులు బడుగు వెంకటేశ్వర్లు తహసిల్దార్ నాగుర్ మీరాకు వినతి పత్రాన్ని బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... హాజీపురం, మిట్టపాలెం గ్రామాల్లో స్థానికేతరులు 54 మంది అక్రమంగా పట్టాలు పొంది, 214 ఎకరాల భూమిని కాజేశారన్నారు. ఈ భూములపై సమగ్ర విచారణ జరిపి, అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని తహసిల్దార్ కు ఆయన విజ్ఞప్తి చేశారు.