నిర్మల్: పెన్షన్ కోసం రోడ్డెక్కిన బీడీ కార్మికులు, ఆర్డీవోకు వినతిపత్రం
Nirmal, Nirmal | Sep 28, 2026 నిర్మల్ జిల్లాలో అర్హులైన బీడీ కార్మికులందరికీ పెన్షన్ దరఖాస్తు అవకాశం కల్పించాలని కోరుతూ టీయూసీఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పీఎఫ్ కటాఫ్ నిబంధన ఎత్తివేయాలని, మరిన్ని కేటగిరీలను పెన్షన్ దరఖాస్తులో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతిపత్రం సమర్పించారు.