ఆపరేషన్ వజ్ర పహార్ లో భాగంగా గుమ్మగట్ట మండలం లోని 75 వీరాపురం గ్రామంలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ను నిర్వహించారు. రూరల్ సీఐ వెంకటరమణ గ్రామ ప్రజలకు మత్తు పదార్థాల పట్ల అవగాహన కలిగించి వారి చేత ప్రతిజ్ఞ చేయించారు. సరైన రికార్డులు లేని 22 బైక్ లు, 2 కార్లు సీజ్ చేసినట్లు తెలిపారు.