విజయనగరం: ఆసియా కప్ అంధుల క్రికెట్ జట్టుకు ఎంపికైన కొప్పరవలస దుర్గారావు
బంగ్లాదేశ్లో నవంబర్ 15 నుంచి 20 వరకు జరగనున్న ఆసియా కప్ అంధుల క్రికెట్ పోటీలకు కొప్పరవలసకు చెందిన టొంపల దుర్గారావు భారత జట్టుకు ఎంపికయ్యారు. గతంలో జాతీయ స్థాయిలో ప్రతిభ చాటిన దుర్గారావును ప్రధాని మోదీ కూడా అభినందించారు. అంతర్జాతీయ పోటీలకు ఎంపిక కావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.