వనపర్తి: వనపర్తి రోడ్డు విస్తరణ: వ్యాపారులకు నష్టపరిహారం చెల్లించాలన్న సతీష్ యాదవ్
వనపర్తిలో రోడ్డు విస్తరణ పనులపై అఖిలపక్ష ఐక్యవేదిక స్పందించింది. అభివృద్ధి పనులకు మద్దతు ఇస్తున్నామని, అయితే వ్యాపారులకు నష్టపరిహారం చెల్లించిన తర్వాతే దుకాణాలు తొలగించాలని డాక్టర్ సతీష్ యాదవ్ డిమాండ్ చేశారు. ఆక్రమణల తొలగింపులో సమాన న్యాయం పాటించాలని కోరారు.