బనగానపల్లె: స్వర్ణాంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బిసి జనార్దన్ రెడ్డి
స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా బనగానపల్లె జీఎం టాకీస్ ప్రాంతంలో నిర్వహించిన పరిశుభ్రత కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి విద్యార్థులతో కలిసి పాల్గొన్నారు. 'పరిశుభ్రత పాటిద్దాం-కాలుష్యాన్ని నివారిద్దాం' అనే నినాదంతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం, పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించారు.