హుజూర్ నగర్: హుజూర్నగర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్ ఆదేశం
హుజూర్నగర్ రామస్వామి గుట్ట వద్ద మోడల్ కాలనీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, ఎస్పీ కె. నరసింహ పరిశీలించారు. నిర్మాణాల్లో లోపాలను సరిచేసి, డ్రైనేజీ, తాగునీరు, రహదారుల వంటి మౌలిక వసతులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.