పెద్దాపురం: సర్వేయర్ పనితీరుపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం
పెద్దాపురం మండల ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో సర్వేయర్ దేవుడు పనితీరుపై జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అసహనం వ్యక్తం చేశారు. దివిలి గ్రామానికి చెందిన ఫిర్యాదుపై చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుబట్టిన కలెక్టర్, ఇకపై ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించవద్దని అధికారులను ఆదేశించారు.