మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన తోటకూర వజ్రష్ యాదవ్ కు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ మంగళవారం నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తోటకూర వైద్యుత్ యాదవ్ మాట్లాడుతూ అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పార్టీని జిల్లాలో బలమైన శక్తిగా తీర్చిదిద్దుతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి పీసరి మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.