ఒంగోలు అర్బన్: ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో MEPMA ఆధ్వర్యంలో COలు, RPల సమీక్ష సమావేశం
Ongole Urban, Prakasam | Aug 19, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో MEPMA ఆధ్వర్యంలో COలు, RPల సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశాన్ని ప్రాజెక్ట్ డైరెక్టర్ నారాయణ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ డైరెక్టర్ మాట్లాడుతూ, ఒంగోలు కార్పొరేషన్ MEPMA కార్యక్రమాల అమలులో మరింత పురోగతి సాధించి, ప్రకాశం జిల్లాలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా ముందంజలో నిలవాలని సూచించారు. PMFME, PMEGP వంటి కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా మరింత మంది SHG మహిళలకు స్వయం ఉపాధి, వ్యాపార అవకాశాలు కల్పించి వారి ఆర్థిక స్థితిని మెరుగుపరచాలని తెలిపారు. అలాగే “One Family – One Entrepreneur” అయ్యేలా చూడాలని