జగిత్యాల: సరస్వతీ దేవి అలంకరణలో దర్శనమిచ్చిన జయ దుర్గా అమ్మవారు
జగిత్యాల విద్యానగర్లో జయ దుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో సామూహిక సరస్వతీ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి, భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు.