ప్రజలు పురమిత్ర యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు. పట్టణ సమస్యలైన పారిశుద్ధ్యం, రోడ్లు, విద్యుత్ తదితర అంశాలను ఫొటోలు, వీడియోలతో యాప్లో అప్లోడ్ చేస్తే అధికారులు వెంటనే స్పందించి పరిష్కరిస్తారని తెలిపారు. సమస్య పరిష్కార స్థితిని కూడా యాప్లోనే తెలుసుకోవచ్చన్నారు. కావలిని స్వచ్ఛంగా, పరిశుభ్రంగా మార్చేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.