ఏటూరునాగారం: ములుగులో శిక్షణార్థులతో కలిసి క్యూ లైన్లో భోజనం చేసిన మంత్రి సీతక్క
ములుగులో పోలీస్ ఉద్యోగాల కోసం శిక్షణ పొందుతున్న యువతను మంత్రి సీతక్క పరామర్శించారు. శిక్షణా తరగతులను పరిశీలించిన ఆమె, అభ్యర్థులతో కలిసి క్యూ లైన్లో భోజనం చేసి వారికి భరోసా కల్పించారు. నిరుద్యోగులు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.