ఒంగోలు అర్బన్: ఒంగోలులో టిడిపి వైసిపి మధ్య రాజకీయ విమర్శలు, వైసిపి ఇన్చార్జ్ చుండూరు రవిపై టిడిపి నాయకులు ఆగ్రహం
Ongole Urban, Prakasam | Oct 3, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలులో టిడిపి వైసిపి మధ్య రాజకీయ విమర్శలు తారస్థాయికి చేరాయి. శనివారం టిడిపి నాయకులు మీడియా సమావేశం నిర్వహించి వైసిపి ఇన్చార్జ్ చుండూరు రవి పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలు ఏర్పడి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాలు పూర్తిగా విజయవంతమయ్యాయని ఇది చూసి ఓర్వలేక చుండూరు రవి విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు చిన్నప్పటినుంచి రాజకీయ అనుభవం ఉందన్నారు. ఒంగోలు వైసిపి ఇన్చార్జ్ చుండూరు రవి కనీసం సర్పంచ్‌గా కూడా ఒక్కసారి కూడా పోటీ చేయలేదని టిడిపి నాయకులు తీవ్రంగా విమర్శించారు.