డోన్: బేతంచర్ల మద్దిలేటి ఆలయం చైర్మన్గా ఎల్ల నాగయ్య
Dhone, Nandyal | Aug 21, 2026 బేతంచర్ల మండల పరిధిలో ప్రసిద్ధిగాంచిన మద్దిలేటి స్వామి కార్యవర్గ కమిటీని ప్రభుత్వం ప్రకటించింది. గత రెండు సంవత్సరాలుగా పలుమార్లు కార్యవర్గ కమిటీ ప్రకటన కోసం ఎదురుచూపులు ఫలించాయి. ఎట్టకేలకు ఆలయ ఛైర్మన్ ఎల్లనాగయ్యను ఎంపిక చేశారు. గత వైసీపీ హయాంలో బీసీ నాయకుడిని ఛైర్మన్ గా నియమించారు. కూటమి ప్రభుత్వంలో ఓసీకి ఛైర్మన్ పదవి వరించింది.