ఒంగోలు అర్బన్: నూకలను చల్లడం ద్వారా వరి పొలంలో కలుపు నివారించవచ్చు : జిల్లా కలెక్టర్
Ongole Urban, Prakasam | Sep 18, 2026
ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు శుక్రవారం మద్దిపాడు తాళ్లూరు తదితర మండలాలలో సాగు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను వ్యవసాయ శాఖ అధికారితో కలిసి సందర్శించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని గుర్తు చేశారు అదేవిధంగా వరి పొలంలో కలుపు నివారణకు నూకలు చల్లడం అనే కొత్త పద్ధతిని చూశానన్నారు నూకలు చల్లడం ద్వారా కలుపు నివారించడంతోపాటు రైతులకు ఎంతో ఖర్చు మిగులుతుందన్నారు ప్రకృతి వ్యవసాయంలో ఖర్చు తక్కువగాను రాబడి ఎక్కువగానే ఉందని రైతులందరూ దీన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు