ఏటూరునాగారం: మిర్చి నారుపై గడ్డి మందు పిచికారీ.. రూ. 6 లక్షల నష్టం!
ఏటూరునాగారం మండలం రామన్నగూడెంలో గుర్తుతెలియని వ్యక్తులు మిర్చి నారుపై గడ్డి మందు చల్లడంతో 8.5 ఎకరాలకు సరిపడా నారు ఎండిపోయింది. దీనివల్ల రూ. 6 లక్షల నష్టం వాటిల్లిందని రైతు రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.