నిరంతరం ప్రజలకు అండగా ఉండి వారి సమస్యలు పరిష్కరిస్తామని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చెప్పారు. మంగళవారం కావలి పట్టణంలోని 10వ వార్డులో ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అధికారులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఏ సమస్య ఉన్నా వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని ప్రజలు అడిగి తెలుసుకున్నారు.