తిర్యాని పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళను అక్రమ రవాణా చేసిన కేసులో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు నిందితుడు లాలాగిరి గోస్వామికి 10 ఏళ్ల జైలు శిక్ష, రూ.10,000 జరిమానా, మిగతా ముగ్గురికి 5 ఏళ్ల జైలు శిక్ష, రూ.5,000 జరిమానా విధించింది. ఉద్యోగం పేరుతో మహిళను ఎత్తుకెళ్లి రూ.1.30 లక్షలకు అమ్మినట్లు దర్యాప్తులో తెలినట్లు ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్ మంగళవారం సాయంత్రం 7గంటలకు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు కాగా శిక్ష ఖరారైందన్నారు.