భువనగిరి: ఖరీఫ్ ధాన్యం కొనుగోలు: జిల్లాలో 325 కేంద్రాల ఏర్పాటు
ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలుపై జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 3 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యంతో 325 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా కొనుగోళ్లు జరపాలని అధికారులను ఆదేశించారు.