గద్వాల్: గద్వాల: రేపల్లె గ్రామంలో ఘనంగా పౌరహక్కుల దినోత్సవం
జోగులాంబ గద్వాల జిల్లా రేపల్లె గ్రామంలో పౌరహక్కుల దినోత్సవం నిర్వహించారు. కుల వివక్షకు తావులేకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలని అధికారులు గ్రామస్తులకు సూచించారు. అంటరానితనం పాటించడం నేరమని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై మరియు తహసీల్దార్ హెచ్చరించారు.