జగ్గంపేట: గోకవరంలో ఘనంగా దసరా ముగింపు ఉత్సవాలు: కనకదుర్గమ్మ శోభాయాత్ర
గోకవరం గద్దె వద్ద ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో దసరా ముగింపు ఉత్సవాలు వైభవంగా జరిగాయి. మెయిన్ రోడ్డుపై జరిగిన శోభాయాత్రలో అమ్మవారి శక్తి వేషధారణలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.