ఈనెల 19వ తేదీ రాత్రి ఉదయగిరికి చెందిన మైదుకూరు శ్రీనివాసులు సర్వరాబాదు హైవే సమీపంలో ప్రమాదపు శాత్తు మోటారు బైక్పై నుంచి జారిపడి గాయపడిన విషయం తెలిసిందే. దీంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. దీంతో ఉదయగిరి మంగళగిరి కాలనీలో విషాదఛాయలు నెలకొన్నాయి