పరీక్ష పేపర్లు భద్రపరిచే విషయంలో కట్టుదిట్టమైన చర్యలు: ప్రకాశం జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక
Ongole Urban, Prakasam | Mar 7, 2026
ఈనెల 16వ తేదీ నుంచి ఏప్రిల్ ఒకటవ తేదీ వరకు జరిగే టెన్త్ క్లాస్ పరీక్ష పేపర్ల విషయంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక తెలిపారు. శనివారం కలెక్టర్ రాజబాబు నిర్వహించిన సమీక్ష సమావేశంలో రేణుక పాల్గొన్నారు. విడతలవారీగా పరీక్ష పేపరు పోస్ట్ ఆఫీస్ నుంచి నిర్దేశించిన సమయంలో స్థానిక స్థానిక పోలీస్ స్టేషనులకు వెళ్తుందని ఓ బాక్సులో సంబంధిత పేపర్ ను పరీక్షకు ఒక్కరోజు ముందుగా స్థానిక పోలీస్ స్టేషన్కు చేర్చడం జరుగుతుందన్నారు.