గజపతినగరం: బొండపల్లి రైతులకి అలర్ట్: ఈ-పంట నమోదుకు సెప్టెంబర్ 30 చివరి తేదీ
బొండపల్లి మండలంలో ఖరీఫ్ పంటల వివరాలను ఈ-పంటలో నమోదు చేయడానికి సెప్టెంబర్ 30 ఆఖరు తేదీ. ఈ విషయాన్ని మండల వ్యవసాయ అధికారి దాసరి గిరిబాబు మంగళవారం వెల్లడించారు. వివరాలు నమోదు చేసుకున్న రైతులు తప్పనిసరిగా ఈ-కేవైసీ కూడా పూర్తి చేసుకోవాలని ఆయన సూచించారు.