హనుమకొండ: డాక్టర్ కుందూరు వెంకటరెడ్డి మృతి: నివాళులర్పించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
హన్మకొండలో మరణించిన డాక్టర్ కుందూరు వెంకటరెడ్డి గారి నివాసానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు వెళ్లారు. వెంకటరెడ్డి గారి భౌతికకాయానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. తనతో ఉన్న టెన్నిస్ అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.