శ్రీశైలం: ఆత్మకూరు మున్సిపాలిటీ చైర్మన్ గా టీడీపీ అభ్యర్థి డాక్టర్ గోవిందరాజులు ఏకగ్రీవ ఎన్నిక
ఆత్మకూరు మున్సిపాలిటీ ఛైర్మన్గా టీడీపీకి చెందిన డాక్టర్ గోవిందరాజులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైసీపీ అభ్యర్థి డాక్టర్ ప్రియాంక బాయి నామినేషన్ ఉపసంహరించుకోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైనట్లు మున్సిపల్ కమిషనర్ బేబి తెలిపారు. ఉత్కంఠగా మారిన మున్సిపల్ పీఠాన్ని చివరకు టీడీపీ దక్కించుకుంది