శ్రీశైలం: సమస్యల పరిష్కారం కోసం వన్ మంత్ వన్ విలేజ్ ఫోర్ విజిట్స్ కార్యక్రమం: మహానంది తహసిల్దార్ రమాదేవి
ప్రజా సమస్యలను గ్రామస్థాయిలను గుర్తించి సమస్యల పరిష్కారం కోసం వన్ మంత్ వన్ విలేజ్ ఫోర్ విజిట్స్ కార్యక్రమం ప్రభుత్వ అమలు చేస్తున్నట్లు తహశీల్దార్ రమాదేవి పేర్కొన్నారు. మహానంది మండలం మసీదుపురం గ్రామంలో వన్ మంత్ వన్ విలేజ్ ఫోర్ విజిట్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామంలో ఫిర్యాదుల స్వీకరణ, ఫీల్డ్ స్థాయిలో పరిశీలన,భూ సమస్యలు పరిష్కారం చేయబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మహబూబ్ దౌల, రీసర్వే డిప్యూటీ తహసీల్దార్ కామేశ్వర్ రెడ్డి,ఆర్ ఐ వెంకట సుబ్బారావు,మండల అధికారులు,టీడీపీ క్లస్టర్ ఇంచార్జ్ నరాల చంద్రమౌళీశ్వర్ రెడ్డి అధికారులు, తదితరులు పాల్గొన్నారు