జగిత్యాల: జగిత్యాల కళాశాలల్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
జగిత్యాల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల మరియు SKNR కళాశాలలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వాణి శ్రీనివాస్ పాల్గొని విద్యార్థినులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. సంప్రదాయ వస్త్రధారణలో విద్యార్థినులు బతుకమ్మలను పేర్చి, కోలాటాలతో సందడి చేశారు.