విద్యాశాఖలో ఇద్దరికి పదోన్నతలు
డీఈఓ వరలక్ష్మి
Chittoor Urban, Chittoor | Jul 6, 2025
చిత్తూరు: విద్యాశాఖలో ఇద్దరికి పదోన్నతలు ఉమ్మడి చిత్తూరు జిల్లా విద్యాశాఖలో ఇద్దరికి పదోన్నతితో పాటు బదిలీ చేసినట్లు డి ఈ ఓ వరలక్ష్మి తెలిపారు. డీఎస్సీ విభాగంలో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న రెడ్డి శేఖర్ ని సీనియర్ అసిస్టెంట్ గాపదోన్నతిపై అన్నమయ్య జిల్లా సమగ్రశిక్షణకు బదిలీ చేశారు. తిరుపతి జిల్లా ఎంఆర్సీలో జూనియర్ అసిస్టెంట్ గాపనిచేస్తున్న వనజకు సీనియర్ అసిస్టెంట్ గా పదోన్నతి ఇస్తూ తిరుపతిలోని టెక్స్ట్ బుక్స్ విభాగానికి బదిలీ చేశారు.