నర్సంపేట: నర్సంపేట, నెక్కొండ బస్టాండ్ల అభివృద్ధికి రూ. 5 కోట్లు కోరిన ఎమ్మెల్యే
నర్సంపేట, నెక్కొండ ఆర్టీసీ బస్టాండ్ల అభివృద్ధి, పునర్నిర్మాణానికి రూ. 5 కోట్లు మంజూరు చేయాలని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎండీ, డీపీఆర్ సిద్ధం చేస్తామని హామీ ఇచ్చారు.